'అంత‌రిక్షం' నుండి కొత్త పోస్ట‌ర్

Wed,November 7, 2018 09:24 AM
Antariksham team wishes happy diwali

వరుణ్ తేజ్ , అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం అంతరిక్షం. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా లో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. దసరా కానుకగా చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్రం నుండి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్‌లు ట్రెడిష‌న‌ల్ లుక్‌లో కనిపిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఘాజీ చిత్రంలానే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని టీం భావిస్తుంది. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు.

2462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS