'అంత‌రిక్షం' పాట‌లు విడుద‌ల‌

Sun,December 16, 2018 07:06 AM
Antariksham 9000 KMPH Jukebox

ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకున్న వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం ఘాజీ ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అంత‌రిక్షం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ క‌థానాయిక‌లుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఉపశీర్షిక 9000 కెఎంపిహెచ్ . ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్‌‌గా ఈ చిత్రంలోని సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్‌‌పై చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘అంతరిక్షం’ ఉండబోతుందని తెలుస్తుంది. జీరో డార్క్, గేమ్ ఆప్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం మరో విశేషం. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రంకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాలు మొద‌లు పెట్టారు మేక‌ర్స్‌. ఇటీవ‌ల ట్రైలర్ విడుద‌ల చేసి మూవీపై భారీ అంచ‌నాలు పెంచారు. ఇక తాజాగా చిత్రానికి సంబంధించిన 5 సాంగ్స్ విడుద‌ల చేశారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన సంగీతం మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ని అల‌రిస్తుంది. డిసెంబ‌ర్ 18న చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌ప‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నాడు. చిత్రంలో దేవ్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ క‌నిపించ‌నుండ‌గా, రియా పాత్ర‌లో అదితి రావు హైద‌రి, పార్వ‌తి పాత్ర‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌నిపించ‌నుంది.

1915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles