వెంకీ-వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Sun,March 25, 2018 11:30 AM
another multi starrer moves on the sets in july

విక్టరీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీ స్టార‌ర్ తెర‌కెక్క‌నుంద‌ని గ‌తంలో ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ని నిజం చేస్తూ కొద్ది సేప‌టి క్రితం మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. వెంకీ, వ‌రుణ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జూలై నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. వరుణ్ తేజ్ పక్కన జోడిగా మెహ్రీన్ ను తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం వెంక‌టేష్ ఆట‌నాదే వేట‌నాదే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అంత‌రిక్షం నేప‌థ్యంలో సంక‌ల్ప్ రెడ్డి తీయ‌బోవు చిత్రం కోసం వ‌రుణ్ తేజ్ ప్రిపేర్ అవుతున్నాడు. హ్య‌ట్రిక్ విజ‌యాలు సాధించిన అనీల్ రావిపూడి ఎఫ్‌2 చిత్రంతో మ‌రో విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.


2605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles