టాలీవుడ్‌లో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి ముహూర్తం కుదిరింది

Thu,July 12, 2018 05:44 PM
another multi starer comes in tollywood

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ హ‌వా న‌డుస్తుంది. అప్ప‌టి సీనియ‌ర్ హీరోలు ఇప్ప‌టి కుర్ర హీరోల‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల అన్నింటిపై అభిమానుల‌లో బోలెడ‌న్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. నాగార్జున‌-నాని కాంబినేష‌న్‌లో దేవదాస్ అనే చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, వెంకీ- వ‌రుణ్‌తేజ్ క‌లిసి ఎఫ్‌2 అనే చిత్రాన్ని చేస్తున్నారు. బాబీ కూడా వెంకీ- నాగ చైత‌న్య కాంబోలో ఓ మ‌ల్టీ స్టార‌ర్ రూపొందిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఇక మ‌హేష్‌- అల్ల‌రి న‌రేష్ కాంబోలో ఓ మ‌ల్టీ స్టార‌ర్ మూవీ, నారా రోహిత్‌, శ్రీ విష్ణు, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో వీర భోగ వ‌సంత రాయ‌లు అనే చిత్రాలు ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్నాయి. త్వరలో ఎన్టీఆర్ -రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కించనున్నాడు. ఇప్పుడు మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ మూవీకి రంగం సిద్ధం చేశారు దిల్ రాజు. ఇటీవ‌ల స‌మ్మోహ‌నం అనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన న‌టీన‌టుల వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

2000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS