పవర్ స్టార్ ఖాతాలో మరో సినిమా

Tue,March 21, 2017 10:03 AM
another movie in pawan list

2019 ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ ఆ లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. తాజాగా డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చిత్రాన్ని పూర్తి చేసిన పవన్, తదుపరి చిత్రాన్ని తన మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం. ఇక తమిళ దర్శకుడు ఆర్ టీ నీసన్ డైరెక్షన్ లోను ఓ సినిమా చేయనున్నాడు పవన్. ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం నిర్మించనున్నాడు. కట్ చేస్తే పవన్ మరో సినిమాకు సైన్ చేసాడని ఫిలిం నగర్ టాక్. మొన్న తమిళ చిత్రం వీరమ్ ని రీమేక్ చేసిన పవన్, ఇప్పుడు విజయ్ మూవీని రీమేక్ చేస్తాడని చెబుతున్నారు. గత ఏడాది సమ్మర్ లో విడుదలై మంచి విజయం సాధించిన థేరి చిత్రాన్ని పవన్ తెలుగులోకి తీసుకురానున్నాడట. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. ఆర్ టీ నీసన్ దర్శకత్వంలో పవన్ చేయబోవు మూవీ కూడా అజిత్ లేటెస్ట్ హిట్ వేదాళం కి రీమేక్ అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది పవన్ ఎక్కువ సినిమాలు చేస్తుండటంతో పాటు తమిళ రీమేక్ లు చేయడం అభిమానులను కాస్త ఆసక్తికరంగానే ఉంది.

2005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles