పవన్ లిస్ట్ లో మరో సినిమా..!

Thu,March 9, 2017 12:33 PM
another movie added into pawan list

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే, మరో వైపు తన సినిమాల స్పీడ్ ని పెంచుతున్నాడు. ప్రస్తుతం గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మూవీని మార్చి 24న థియేటర్స్ లోకి తీసుకురానున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఏఎమ్ రత్నం బ్యానర్లో ఆర్ టీ నీసన్ తెరకెక్కించనున్న మరో చిత్రం చేయనున్నాడు. ఇవే కాకుండా సుబ్బిరామిరెడ్డి రూపొందించనున్న మల్టీస్టారర్ కూడా చేయనున్నట్టు సమాచారం. ఇక తాజా సమాచారం ప్రకారం పవన్ ఖాతాలో మరో సినిమా చేరిందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ మూవీ చేయడానికి పవన్ అంగీకరించాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. కాటమరాయుడు చిత్ర విషయానికి వస్తే ఈ చిత్రంను మార్చి 24న విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో టీం కసిగా పనిచేస్తుందంటూ శివ బాలాజీ ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో డబ్బింగ్ కి సంబంధించి పనులను పిక్స్ తీసి షేర్ చేశాడు. వాటిపై మీరు ఓ లుక్కేయండి.

2242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS