ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కి తెర‌లేపిన వ‌ర్మ‌

Tue,January 29, 2019 01:13 PM
another interesting pic comes from Lakshmis Ntr

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం ల‌క్ష్మీ పార్వ‌తి కోణం నుండి ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నాడు. ఫిబ్ర‌వరిలో విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి రోజుకో పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ అభిమానుల‌లో సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాడు. అయితే పాత్ర‌ల‌లో న‌టిస్తున్న న‌టుల వివ‌రాలు వెల్ల‌డించ‌కుండానే పోస్ట‌ర్‌లు రిలీజ్ చేస్తున్న వర్మ తాజాగా మ‌రో స్టిల్ రిలీజ్ చేశాడు. దీనికి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఈ పాత్ర‌లు ఎవ‌రివి ? లక్ష్మీ పార్వతితో వారు ఎందుకు కలత చెందుతున్నారు? అనే కామెంట్ పెట్టాడు. దీనిపై నెటిజ‌న్స్ ఫోటోలో క‌నిపిస్తున్న‌ది హ‌రికృష్ణ‌తో పాటు ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు అని ట్వీట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. చిత్రంలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


3683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles