జయలలిత జీవిత నేపథ్యంలో మరో చిత్రం

Wed,April 10, 2019 11:24 AM
another biopic on jayalalitha

ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ఒకరి జీవిత నేపథ్యంలోనే మూడు నాలుగు సినిమాలు రూపొందుతుండడం విశేషం . ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో మూడు సినిమాలు రూపొందగా మరో చిత్రం రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఎన్టీఆర్‌ ఆత్మ చెప్పిన విషయాల ఆధారంగా ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమాను కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పడు ఈయనే జయలలిత జీవిత నేపథ్యంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. ‘శశి లలిత’ పేరిట తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఎం జరిగింది అనేది చూపించబోతున్నారు.

జయలలిత జీవితంలో చోటు చేసుకున్న అన్ని కీలకమైన విషయాలు ఇందులో ఉంటాయి. ఇవన్నీ జయలలిత ఆత్మ చెప్పిన విషయాలు. వాటి ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నా. జయ బాల్యం, నటిగా మారడం, రాజకీయ ప్రవేశం, జయతో తనకున్న పరిచయం వంటి విషయాలు కూడా ఇందులో ఉంటాయి. జయలలిత ఆత్మ కూడా కొన్ని విషయాలు చెప్పిందని తద్వారా ‘శశి లలిత’ సినిమాను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు జగదీశ్వరరెడ్డి. మరోవైపు కోలీవుడ్‌లో జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తుంది. ఇందులో నిత్యామీన‌న్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇక రీసెంట్‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ తాను త‌లైవీ అనే టైటిల్‌తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇందులో కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది .

1125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles