అన్నాతో క‌లిసి గంగా హార‌తి చేప‌ట్టిన‌ ప‌వ‌న్‌

Thu,December 7, 2017 12:01 PM
Anna lezhenova at varanasi with pawan

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న 25వ చిత్రంగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అజ్ఞాత‌వాసి అనే చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. చిత్ర చివ‌రి షెడ్యూల్ వార‌ణాసిలో జ‌ర‌గ‌గా, అక్క‌డి నుండే మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. అయితే వార‌ణాసిలో ప‌వ‌న్ త‌న‌ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికి ఫ్రీం టైంలో త‌న భార్య అన్నా లెజినోవాతో క‌లిసి విశ్వేశ్వ‌రుని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం , ఆ త‌ర్వాత ప‌విత్ర గంగాన‌దిలో స్నాన‌మాచ‌రించి, హారతి చేప‌ట్ట‌డం చేశారు. ప‌వ‌న్ దంప‌తులు ఇద్ద‌రు శివుడికి ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేశార‌ని స‌మాచారం. ప‌వ‌న్‌కి కేవ‌లం సౌత్‌లోనే కాదు నార్త్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌డంతో ఆయ‌న‌ని చూసేందుకు జ‌నాలు బారులు తీరారు. ఇక ప‌వ‌న్ మూవీ సెట్‌లో పెద్ద‌గా క‌న‌బ‌డని అన్నా లెజినోవా త‌న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల పుట్టిన త‌ర్వాత తొలిసారి లొకేష‌న్‌కి వెళ్లారు. ప‌వ‌న్ దంప‌తులు హార‌తి చేప‌ట్టడానికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

2616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS