అంజ‌లి హ‌ర‌ర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Sat,April 20, 2019 01:51 PM

తెలుగింటి సీత‌మ్మ అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో రాజు విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన చిత్రం లిసా. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఏక‌కాలంలో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం హ‌రర్ నేప‌థ్యంలో రూపొందుతుండ‌గా, చిత్రానికి సంబంధించి విడుదలైన టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచింది. గీతాంజ‌లి త‌ర్వాత అంజ‌లి చేస్తున్న మ‌రో హ‌ర్రర్ చిత్రం లిసా అని చెప్ప‌వ‌చ్చు . పీజీ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేశంలోనే మొదటి సారిగా స్టీరియోస్కోపిక్ 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న హార్రర్ పిక్చర్ ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరించారు. మే 24న‌ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. బ్రహ్మానందం, మార్కండ్ దేశ్‌పాండే తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రం హ‌ర్ర‌ర్ అండ్ థ్రిల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. సంతోష్ దయానిధి సంగీతం అందించారు.

1155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles