హార్రర్ థ్రిల్లర్ సినిమాలో అంజలి లుక్..!

Thu,November 8, 2018 12:33 PM
anjali first look in lisa telugu movie

గీతాంజలి హార్రర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి అంజలి తాజాగా మరో హార్రర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. లిసా పేరిట తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో అంజలి ప్రాధన పాత్ర పోషిస్తున్నది. పీజీ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే గతంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో అంజలి లుక్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ లుక్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల్లో ఇది ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశంలోనే మొదటి సారిగా స్టీరియోస్కోపిక్ 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న హార్రర్ పిక్చర్ ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

1962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles