న‌య‌న‌తార 'అంజ‌లి సి.బి.ఐ' చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌

Wed,February 13, 2019 09:54 AM
Anjali CBI Theatrical Trailer released

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌కి త‌మిళంలోనే కాదు తెలుగులోను మంచి డిమాండ్ ఉండ‌డంతో ఆమె నటించిన త‌మిళ చిత్రాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ఇటీవ‌ల అర‌మ్ అనే త‌మిళ చిత్రాన్ని తెలుగులో క‌ర్త‌వ్యం పేరుతో విడుద‌ల చేశారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు నయనతార‌ సీబీఐ ఆఫీసర్‌గా నటించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ని తెలుగులో ‘అంజలి సీబీఐ’ పేరుతో విడుదల చేస్తున్నారు. దర్శకుడు ఆర్.అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ క్రైమ్ థ్రిల్లర్ తెర‌కెక్కించారు. అథ‌ర్వ, రాశీఖ‌న్నా కీల‌క పాత్రల్లో న‌టించ‌గా.. బాలీవుడ్ ద‌ర్శకుడు అనురాగ్ క‌శ్యప్ ప్రతినాయకుడిగా న‌టించారు. ప్రముఖ హీరో విజ‌య్ సేతుప‌తి విక్రమాదిత్య అనే అతిథి పాత్రలో కనిపించారు. హిప్ హాప్ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర తెలుగు హక్కులను కొనుగోలు చేసిన నిర్మాతలు సిహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్.. విశ్వశాంతి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఫిబ్రవ‌రి 22న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్‌ని సురేష్ బాబు చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. మీరు ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి.

915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles