క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌బోతున్న నువ్వు నేను హీరోయిన్

Tue,March 26, 2019 09:38 AM
Anita Hassanandani pregnant with twins

నువ్వు నేను చిత్రంలో ఉదయ్ కిరణ్ తో జతకట్టిన అనితకు మొదట్లో మంచి ఛాన్స్ లే దక్కిన తర్వాత ఆఫర్లు లేక ఈ అమ్మడు బాలీవుడ్ ఫ్లైటెక్కింది. అక్కడ కూడా అనితకు సరైన అవకాశాలు రాకపోవడంతో పలు రియాలిటీ షోస్ లో ,సీరియల్స్ లో నటిస్తూ అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తోండగా, రోహిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత రోహిత్ శెట్టి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ మ‌ధ్య అనిత త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చిన్న పిల్లవాడి ఫొటోను షేర్ చేస్తూ.. కాప్షన్‌లో తన భర్త రోహిత్‌రెడ్డి‌తో ‘పిల్లల గురించి ప్లానింగ్ చేద్దాం’ అని ట్యాగ్ చేసింది.

అనిత తాజాగా త‌న‌ భ‌ర్త‌తో ఉన్న జిఫ్ ఎమోజీని షేర్ చేస్తూ.. నా ప్రేమికుడా, నీ మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. జీవితంలో ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. 6 ప్యాక్ యాబ్స్‌, ఇద్ద‌రు క్యూ క్యూట్ బేబీస్ త్వ‌ర‌లోనే రానున్నారు అని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది అనిత‌. అనిత పోస్ట్‌ని బ‌ట్టి త్వ‌ర‌లో ఆమె ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌బోతుందని అర్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ప‌లు సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్న అనిత చివ‌రిగా తెలుగులో మ‌న‌లో ఒక‌డు అనే చిత్రం చేసింది. ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టించి, సంగీతం అందించ‌డంతో పాటు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం మ‌న‌లో ఒక‌డు. హిందీ సీరియల్ ‘నాగిని-3’ చేస్తున్న అనిత అందులో త‌న న‌ట‌నకి ప్ర‌శంస‌లు అందుకుంటుంది.

5639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles