స్టేజ్‌పై నానితో స్టెప్పులు వేయించిన అనిరుధ్‌

Wed,September 11, 2019 08:39 AM

జెర్సీ వంటి వైవిధ్యభ‌రిత క‌థాచిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన నాని ఇప్పుడు ఓ రివెంజ్ డ్రామాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. గ్యాంగ్ లీడ‌ర్ అనే పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించారు. ఇందులో ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తికేయ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ చక్క‌ని బాణీలు అందించారు. సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లోని గురుజాడ క‌ళాక్షేత్రంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో అనిరుధ్ సీను సిరిగి.. సీట్లు ఇరిగి.. సీటి కొట్టాలోయీ అనే ప్ర‌మోష‌నల్ సాంగ్‌ని ఆల‌పించ‌గా, ఈ పాట‌కి నాని, ప్రియాంక‌, కార్తికేయ‌లు స్టేజ్‌పైన స్టెప్పులు వేసి అల‌రించాడు. ఆడియ‌న్స్ కూడా లేచి మ‌రీ డ్యాన్స్ చేశారు. ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్ర‌లో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్‌గా అల‌రించ‌నున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు.

914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles