ఎన్టీఆర్ సినిమా నుండి అనిరుధ్ అవుట్..!

Fri,February 16, 2018 03:27 PM

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 28వ చిత్రంగా త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వంలో ఓ మూవీ తెర‌కెక్కనున్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుండి ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్ళనుండ‌గా, ఇందులో క‌థానాయిక‌గా శ్రద్ధా క‌పూర్ న‌టిస్తుంద‌నే ప్రచారం జ‌రుగుతుంది. ఇక సంగీత ద‌ర్శకుడిగా త‌మిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచందర్‌ని ఎంపిక చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో రూపొందిన అజ్ఞాత‌వాసి చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్‌, వెంట‌నే ఎన్టీఆర్ సినిమాకి ఎంపిక కావ‌డం అంద‌రిని ఆశ్చర్య‌ప‌ర‌చింది. తాజా స‌మాచారం ప్రకారం ఎన్టీఆర్ సినిమా నుండి అనిరుద్ త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తుంది. ప‌లు కార‌ణాల వ‌ల‌న ఎన్టీఆర్ సినిమాకి తాను మ్యూజిక్ అందించ‌లేన‌ని చెప్పడంతో ఆ స్థానంలో దూకుడు మీదున్న థ‌మ‌న్‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో తార‌క్ స‌రికొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. హాలీవుడ్ లో ఫేమస్ అయిన వాన్స్ హార్ట్‌వెల్ అనే స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్‌ని ఈ సినిమా కోసం టాలీవుడ్ కి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

4076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles