మీటూ.. అనిర్బన్ ఆత్మహత్యాయత్నం

Fri,October 19, 2018 05:02 PM
Anirban Blah accused in Me Too attempts suicide

ముంబై: మీటూ ఆరోపణలు తట్టుకోలేకపోయిన సెలబ్రిటీ మేనేజర్ అనిర్బన్ బాహ ఇవాళ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. క్వాన్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ సహవ్యవస్థాపకుడు అయిన అనిర్బన్.. నవీ ముంబైలోని వాశీ ఓల్డ్ బ్రిడ్జ్ వద్ద సూసైడ్‌కు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జ్ మీదున్న బారికేడ్లు ఎక్కుతున్న సమయంలో అనిర్బన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిర్బన్ తమను లైంగికంగా వేధించారని అనేక మంది మహిళలు ఆరోపణలు చేశారు. దీంతో క్వాన్ నుంచి తప్పుకోవాలని అనిర్బన్‌పై వత్తడి పెరిగింది. మానసిక ఆందోళనకు గురైన అతను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బ్రిడ్జ్ మీద ఏడుస్తూ కనిపించిన అనిర్బన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లామని, తనపై వచ్చిన ఆరోపణలతో తీవ్ర క్షోభకు గురైనట్లు తెలిపాడు.

1980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS