బాలీవుడ్ మూవీ రీమేక్ చేసే ఆలోచ‌న‌లో బ‌డా ప్రొడ్యూస‌ర్‌

Sat,October 20, 2018 09:36 AM
Anil Sunkara Bags The Rights For Bollywood Film

టాలీవుడ్‌లో మంచి చిత్రాల‌ని నిర్మించిన అనీల్ సుంక‌ర ఇప్పుడు తెలుగులో ఓ రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్రం శాదీ మే జ‌రూర్ చిత్రం తెలుగు రైట్స్ ఇప్ప‌టికే అనీల్ సుంక‌ర ద‌క్కించుకున్నాడ‌ని, ఈ మూవీలో ప్ర‌ధాన పాత్ర కోసం యంగ్ హీరోని తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. శాదీ మే జ‌రూర్ ఆనా చిత్రంలో రాజ్ కుమార్ రావు, కృతి క‌ర్భంధ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, అక్క‌డ ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఫ్యామిలీ డ్రామాగా ఎంతో హాస్యంతో కూడుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని భావించి అనీల్ సుంక‌ర రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు అతి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయ‌ని అంటున్నారు.

1757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles