మ‌హేష్ మూవీకి భారీ పారితోషికం అందుకోనున్న యంగ్ డైరెక్ట‌ర్

Thu,April 4, 2019 01:01 PM
Anil Ravipudi shocking remuneration for mahesh 26

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్న డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్ 2 సినిమాల సక్సెస్‌తో ఏకంగా సూపర్‌ స్టార్ మ‌హేష్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ కొట్టేశాడు. ముందుగా మ‌హేష్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని అంద‌రు భావించిన‌ప్ప‌టికి, చివ‌రికి బాల్ అనీల్ రావిపూడి కోర్టులోకి వ‌చ్చి ప‌డింది. మ‌హర్షి సినిమా రిలీజ్ త‌ర్వాత మ‌హేష్ 26వ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం. అయితే ఈ చిత్రానికి అనీల్ రావిపూడి 12 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అందుకోనున్నాడ‌ని ఫిలిం న‌గ‌ర్ టాక్. మ‌హేష్ చిత్రానికి ఎలాగు భారీగానే బిజినెస్ అవుతుంది కాబ‌ట్టి నిర్మాత‌లు కూడా మ‌నోడికి అడిగినంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. మ‌హేష్ 26వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి అనీల్ సుంక‌ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ర‌ష్మిక మంథాన‌, అదితి రావు హైద‌రి చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 2020లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు.

2324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles