అనీల్ రావిపూడి ఐదో సినిమా మ‌హేష్‌తో..!

Tue,March 19, 2019 10:09 AM

ర‌చ‌యిత‌గా కెరీర్ మొద‌లు పెట్టిన అనీల్ రావిపూడి ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారి వ‌రుస విజ‌యాలు సాధించాడు. ప‌టాస్‌తో తొలి హిట్ కొట్టిన అనీల్ ఆ త‌ర్వాత సుప్రీమ్ ,రాజా ది గ్రేట్ చిత్రాల‌తో అందరి దృష్టి ఆక‌ర్షించాడు. ఇటీవ‌ల ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో త‌న ఖాతాలో నాలుగో విజ‌యాన్ని వేసుకున్నాడు. ఇక అనీల్ రావిపూడి ఐదో చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుండ‌గా,ఈ చిత్రం టాప్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్‌లో నెంబ‌ర్ 5 .. లోడింగ్‌అనే క్యాప్ష‌న్ పెట్టాడు. అంటే త‌న ఐదో చిత్రానికి సంబంధించిన ప‌నులు మొద‌లు పెట్టేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ త‌న 25వ సినిమాగా మ‌హ‌ర్షి చేస్తుండ‌గా, ఈ సినిమా పూర్తైన వెంట‌నే అనీల్ రావిపూడితో త‌న 26వ సినిమాని మొద‌లు పెట్ట‌నున్నాడు. బ‌హుశా వచ్చే నెల నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు టాక్‌. ర‌ష్మిక మంథాన‌, అదితి రావు హైద‌రి చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 2020లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు.1870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles