విడాకులు వ‌ద్దు.. బ్రాడ్ కావాలి..

Fri,August 11, 2017 03:53 PM
Angelina Jolie calls off divorce from Brad Pitt

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ మ‌న‌సు మార్చుకున్న‌ది. త‌న భ‌ర్త బ్రాడ్ పిట్‌కు ఇచ్చిన విడాకుల నోటీసును ఆమె వెన‌క్కి తీసుకోవాల‌నుకుంటున్న‌ది. తాను చేసిన పొర‌పాటును తెలుసుకున్న జోలీ ఇప్పుడు త‌న డైవ‌ర్స్‌కు బ్రేక్ వేయాల‌నుకుంటున్న‌ది. కోపంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని క్ష‌మాగుణంతో వెన‌క్కి తీసుకునేందుకు జోలీ రెడీ అయిన‌ట్లు టాక్‌. 12 ఏళ్ల బంధానికి ఈ హిట్ పెయిర్ ఇటీవ‌ల బ్రేక్ వేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తున్న చేసుకున్న‌ది జోలీ. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ ఇద్ద‌రికీ ఆరుగురు పిల్ల‌లు ఉన్నారు. 2004లో ఓ ఫిల్మ్ షూటింగ్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డిన త‌ర్వాత.. అప్ప‌టి నుంచి వీళ్లు క‌లిసే ఉన్నారు. కానీ 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే తాగుడుకు బానిస అయిన బ్రాడ్ పిట్ గ‌త ఏడాది జోలీతో విమానంలో గొడ‌వ‌ప‌డ్డాడు. దీంతో బ్రాడ్ పిట్ ప్ర‌వ‌ర్త‌నపై జోలీకి కోపం వ‌చ్చింది. ఆ ఆవేశంలోనే విడాకులు కావాలంటూ ఆమె బ్రాడ్‌కు లీగ‌ల్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసు ఇచ్చిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌ళ్లీ జోలీ ఎటువంటి న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. విడాకుల కేసు కొద్దిగా కూడా ముందుకు సాగ‌లేదు. అయితే బ్రాడ్‌పై మ‌న‌సు మారిన‌ట్లు తాజాగా వానిటీ ఫెయిర్ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జోలీ త‌న‌ అభిప్రాయాన్నివ్య‌క్తం చేసింది. కోపం త‌గ్గింద‌ని, బ్రాడ్ కావాల‌నుకుంటున్న‌ట్లు జోలీ ఆ ప‌త్రిక‌తో చెప్పింది.

4288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS