భావోద్వేగ‌పు పోస్ట్ షేర్ చేసిన‌ ప్రియాంక చోప్రా

Wed,June 12, 2019 11:26 AM

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్ళిన ప్రియాంక చోప్రా మ‌ళ్ళీ రెండేళ్ళ త‌ర్వాత హిందీ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. జైరా వ‌సీమ్ ప్ర‌ధాన పాత్ర‌లో కనిపించ‌నుంది. ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ పాత్ర‌లు ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టేలా ఉంటాయ‌ని అంటున్నారు. సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో ప్రియాంక త‌ల్లిగా జైరా న‌టిస్తుంది. అక్టోబ‌ర్ 11,2019న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.తాజాగా చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో టీంతో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ లాంగ్ పోస్ట్‌లో త‌న ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. ఈ చిత్రం త‌న‌కి చాలా స్పెష‌ల్ అని చెబుతూ, మూవీ త‌న‌కి ఎన్నో నేర్పించింద‌ని చెప్పుకొచ్చింది. అంతేకాదు చిత్ర యూనిట్‌తో క‌లిసి పని చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని కూడా పేర్కొంది ప్రియాంక‌.


చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్‌ చెప్పినా మోటివేషనల్‌ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథని తీసుకొని ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రాన్ని తెర‌కెక్కించారు . అయేషా పాత్ర‌లో జైరా క‌నిపించ‌నుండ‌గా, వయ‌సులోని వివిధ ద‌శ‌ల‌లో ప్రియాంక లుక్స్ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. రియ‌ల్ లైఫ్ స్టోరీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్రియాంక .. సిద్ధార్ద్ రాయ్ క‌పూర్‌, ఆర్ఎస్‌వీపీతో క‌లిసి నిర్మించింది. ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ప్రియాంక చోప్రాలు 2005లో దిల్ ద‌ఢ్‌ఖ‌నే దో అనే చిత్రంతో తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ది స్కైజ్ ఈజ్‌ పింక్ వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న‌ రెండో చిత్రం. ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌డం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ అంటున్నారు.
View this post on Instagram

And it’s a wrap. This movie is special to me on so many levels. Not just because @roykapurfilms and @rsvpmovies (Sid and ronnie) partnered with me on my first Hindi production.. but also took the chance on me to bring to life a character and a true story that needed to be told. @faroutakhtar you made an amazing co actor all over again with all the laughter and fun!(you were missed tonight) and my amazing @zairawasim_ and @rohitsaraf10 who I’ve made friends for life with! This was the hardest loveliest experience. Thank you @shonalibose_ for your incredibly unique vision. I’m so proud of your faith in me. Thank you so much to Our crew who worked tirelessly for 10 months to make this special piece of cinema. I love you all. ❤️ See u at the pictures!!! 🙏🏽 #skyispink 🍿 🎥

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

1626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles