త‌ప్పు జ‌రిగింద‌ని ఒప్పుకున్న‌ యాంక‌ర్ ర‌వి

Sat,June 15, 2019 12:35 PM
anchor ravi gives clarity on video

యాంక‌ర్ రవి ప్ర‌స్తుతం బిజీగా ఉన్న మేల్ యాంక‌ర్స్‌ల‌లో ఒకరు. ప‌లు టీవీ షోస్ చేస్తూనే అడ‌పద‌డ‌పా సినిమాలలో న‌టిస్తున్నాడు. అయితే ర‌వి అంటే అంద‌రికి ఠ‌క్కున గుర్తొచ్చేది ప‌టాస్ షో. ఈ షో ప్ర‌స్తుతం సెకండ్ సీజ‌న్ జ‌రుపుకుంటుండ‌గా, రీసెంట్‌గా జ‌రిగిన ఓ ఎపిసోడ్‌లో మ‌హిద‌ర్ అనే వ్య‌క్తి ఏపీ ప్ర‌జ‌ల‌ని కించ ప‌రిచే విధంగా కామెంట్ చేశాడు. ఆ స‌మ‌యంలో యాంక‌ర్ ర‌వి క్లాప్స్ కొడుతూ స్టేజ్‌పైకి వెళ్ళాడు. అప్పుడు ర‌వి ప్ర‌వ‌ర్త‌న మ‌హిధ‌ర్ చేసిన కామెంట్స్‌ని ప్రొత్స‌హించేలా ఉంద‌ని భావించిన ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న‌ని తిట్టి పోస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌వి ట్విట్ట‌ర్‌లో వీడియో ద్వారా వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు.

మొన్న‌ 23వ తారీఖున ప‌టాస్‌లో మహిధ‌ర్ చేసిన కామెంట్స్ త‌ప్పు అని నేను, ప‌టాస్ ఒప్పుకుంటుంది . 'మహిధర్' క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ సమయంలో నేను అతడిని సపోర్ట్ చేయలేదు. యాంకర్‌గా అక్క‌డ ఎవ‌రు ఉన్నా అలానే ప్ర‌వ‌ర్తిస్తారు. ఇలాంటి వివాదాల‌లో ద‌య‌చేసి నన్ను లాగొద్దు. కాంట్ర‌వ‌ర్సీలు రావ‌డం, వాటికి వీడియోల ద్వారా వివ‌ర‌ణ ఇవ్వ‌డం నాకు కామ‌న్ అయిపోయింది. నేను తెలుగు వాడిని. నాకు ఎపీ సీఎం జ‌గ‌న్ అంటే ఎంతో ఇష్టం. వారి ఫ్యామిలీతో కూడా మాట్లాడాను. మ‌రో నెల రోజుల‌లో శ్రీ జ‌గ‌న్‌ని క‌ల‌వ‌బోతున్నాను . నేను సారీ చెప్పాల‌ని అంద‌రు అంటున్నారు. నేను త‌ప్పు చేయ‌లేదు. ఆ స్టేట్‌మెంట్‌ని మాత్రం నేను స‌పోర్ట్ చేయ‌నంటూ యాంక‌ర్ ర‌వి వీడియోలో పేర్కొన్నాడు.


18052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles