యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు

Fri,January 19, 2018 03:20 PM
యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు

హైదరాబాద్: మోతాదుకు మించి మద్యం తాగి వాహనం నడిపిన కేసులో యాంకర్ ప్రదీప్‌పై నాంపల్లి కోర్టు చర్యలు తీసుకున్నది. మూడేండ్లపాటు ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. దాంతో పాటు రూ.2,100 జరిమానాను కోర్టు విధించింది.

అత్యధిక మోతాదులో మద్యం సేవించి వాహనం నడిపితే నిబంధనల ప్రకారం జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, లేదా మూడేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దవుతుంది. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని ప్రదీప్‌కు కోర్టు అవకాశమివ్వగా రెండోది కోరుకున్నట్లు సమాచారం.

డిసెంబర్ 31న మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ప్రదీప్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సంద‌ర్భంగా కేసును విచారించిన నాంప‌ల్లి కోర్టు ప్ర‌దీప్‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రదీప్ ఇప్పటికే గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్‌కు హాజరైన విషయం తెలిసిందే.

4429

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018