రోడ్డుప్రమాదంలో టీవీ యాంకర్ లోబోకు గాయాలు

Mon,May 21, 2018 01:25 PM
Anchor Lobo injured in road accident in Janagama district

జనగాం : రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. టీవీ యాంకర్ మహమ్మద్ కయిమ్(లోబో) ప్రయాణిస్తున్న కారు.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఢీకొన్నాయి. లోబో తన కారులో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. లోబోకు జనగాం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. లోబో ప్రయాణిస్తున్న కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆటో నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ - టీఎస్ 09 ఈఎక్స్ 1497.

6444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles