బిగ్ బాస్ 3లో యాంక‌ర్ లాస్య ?

Sun,June 23, 2019 08:35 AM
Anchor Lasya Manjunath In Bigg Boss 3

బిగ్ బాస్ సీజ‌న్ 3 హంగామా మొద‌లైంది. ఇప్ప‌టికే ప‌లు ప్రోమోల‌తో స్టార్ మా అంచనాలు పెంచుతుంది. మీలో కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మంతో బుల్లితెర ప్రేక్ష‌కులని అల‌రించిన నాగ్ ఈ సారి బిగ్ బాస్ సీజ‌న్ 3ని హోస్ట్ చేయ‌నున్నాడు. ఇక ఇందులో కంటెస్టెంట్స్‌గా ఎవ‌రు ఉంటార‌న్న‌దే ఇప్పుడు అస‌లు సిస‌లైన చ‌ర్చ‌. జూలైలో ప్రారంభం కానున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ప‌లువురి జాబితా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో యాంక‌ర్స్‌, రాజకీయ నాయ‌కులు, న‌టులు, క్రీడా ప్ర‌ముఖులు ఉన్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం కొన్నాళ్ళ క్రితం యాంక‌ర్ ర‌వితో క‌లిసి బుల్లితెర‌పై సందడి చేసిన లాస్య బిగ్ బాస్ 3లో పాల్గొన‌బోతుంద‌ని టాక్. ఇటీవ‌ల త‌ల్లి ప్ర‌మోష‌న్ కూడా అందుకున్న ఈ అమ్మ‌డు మ‌ళ్ళీ బిగ్ బాస్ కార్య‌క్ర‌మంతో లైమ్ లైట్‌లోకి రావాలని అనుకుంటుంద‌ట‌. మ‌రి లాస్య బిగ్ బాస్‌లో పాల్గొంటుందా లేదా అనేది తెలియాంటే ఆ కార్య‌క్రమం మొద‌ల‌య్యేవ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు మ‌రి.

3548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles