ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా అనసూయ

Wed,January 24, 2018 09:50 AM
anchor anasuya first look revealed

పెళ్లైన కొత్తలో ఫేమ్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాయత్రి. ఈ మూవీలో మోహన్ బాబు డబుల్ రోల్ చేయనున్నాడు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ గా తెలుస్తుంది హీరోయిన్ నిఖిల ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నటిస్తుందట. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీనే నిర్మిస్తోంది. మంచు విష్ణు ఇందులో ముఖ్య పాత్ర పోషించనుండగా, ఆయన సరసన శ్రేయ కథానాయికగా నటిస్తుంది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన పాత్రల లుక్స్ ఒక్కోటిగా విడుదల చేస్తున్న టీం తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అనసూయ శ్రేష్ఠ జయరాం అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా కనిపించనున్నట్టు ఫస్ట్ లుక్ ని బట్టి తెలుస్తుంది. పోస్టర్ పై ఆమె తీక్షణ చూపులు పాత్రపై ఆసక్తి రేపుతోంది. వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పదంటూ కథలో ప్రాధాన్యత ఉండే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది . యాంకర్ గా రాణిస్తున్న అనసూయ మధ్య మధ్యలో ఇలా వెండితెరపై మెరుస్తూ అభిమానులకి పసందైన విందు అందిస్తుంది.


1219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS