అనసూయ ‘రంగమ్మత్త’ లుక్ చూశారా..?

Mon,March 19, 2018 09:39 PM
ANasuya Rangammattha First look revealed


హైదరాబాద్ : సుకుమార్, రామ్‌చరణ్‌ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘రంగస్థలం’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా.. అనసూయ, జగపతిబాబు, ఆదిపినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ ను అనసూయ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. రంగమ్మత్తను కలవండి అని ట్వీట్ చేసింది అనసూయ. రంగమ్మత్త లుక్ లో అనసూయ చాలా బాగుందని, పల్లెటూరి గెటప్ లో సహజంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెట్టేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ టాక్ ను సొందం చేసుకున్నాయి. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకురానుంది.

6050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS