అన‌సూయ చిత్రం నుండి ఓ అమ్మ పాట విడుద‌ల‌

Sun,May 12, 2019 10:36 AM
Anasuya Kathanam Movie Songs released

అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్రధాన ప్ర‌ధాన పాత్ర‌లో 'కథనం' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'మహిళా దినోత్సవం' సందర్భాన్ని పురస్కరించుకుని సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా నుండి ఓ అమ్మ అనే సాంగ్‌ని ఇవాళ విడుద‌ల చేసింది. రోష‌న్ సాలురు సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సాంగ్‌ని కాళ‌భైర‌వ ఆల‌పించారు. ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మైంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. ‘క్ష‌ణం, రంగ‌స్థ‌లం’ అనంతరం ‘క‌థ‌నం’తో అనసూయ హ్యాట్రిక్ కొట్టబోతోంది. ఈ వేసవి సెలవుల్లో సినిమాను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రి తాజాగా విడుద‌లైన ఓ అమ్మ లిరిక‌ల్ సాంగ్‌ని మీరు విని ఎంజాయ్ చేయండి.

2843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles