చ‌ల్ల‌ని ప్రాంతాల‌లో ఫ్యామిలీతో అన‌సూయ చ‌క్క‌ర్లు

Wed,May 23, 2018 08:51 AM
Anasuya  enjoyed with her family in  jammu

యాంకర్ గా , నటిగా రాణిస్తున్న అందాల భామ అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై యాంక‌ర్‌గా అల‌రిస్తూనే వెండితెరపై ముఖ్య పాత్రలు పోషిస్తుంది. రంగస్థలం 1985 అనే చిత్రంలో కీలక పాత్ర పోషించింది అనసూయ. రంగ‌మ్మ‌త్త పాత్రలో అన‌సూయ మెమోర‌బుల్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. వినోద‌భ‌రిత క‌థాంశంతో అనీల్ రావిపూడి రూపొందించ‌నున్న‌ మల్టీ స్టార‌ర్ ఎఫ్‌2 చిత్రంలోను అన‌సూయని కీల‌క పాత్ర‌కి ఎంపిక చేశార‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే మొన్న‌టి వ‌ర‌కు షూటింగ్స్‌తో బిజీగా ఉన్న అన‌సూయ ఫ్యామిలీతో విహార యాత్ర‌కి వెళ్ళింది. బీచ్ ఒడ్డున త‌న పిల్ల‌లు, భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫోటోస్‌ని ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌లో ఆనందాన్ని క‌లిగించింది. ఇక తాజాగా జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్రంలోని లేహ్‌, ల‌డ‌క్ ప్రాంతాల‌లో త‌న ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలోని షేర్ చేసింది. ‘లేహ్, లడక్ ప్రాంత్రాలు ఎంత అందంగా ఉన్నాయి! జీవితానుభవం! భారత్ లోని పలు ప్రాంతాల్లో ఏడాదికోసారి పర్యటించాలని కచ్చితంగా నిర్ణయించుకున్నా. ఇన్ క్రెడిబుల్ ఇండియాలోని వనరులను, సంస్కృతీ సంప్రదాయాలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసి గర్వపడుతున్నా. ఐ లవ్ ఇండియా’ అని అనసూయ సంతోషం వ్యక్తం చేసింది.


5530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles