అన‌సూయ అతిధి పాత్ర‌పై క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

Sat,December 8, 2018 09:59 AM
anasuya bharadwaj special song in f2

ఇటు యాంక‌ర్‌గా అల‌రిస్తూనే అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై కూడా మెరుస్తుంది అన‌సూయ‌. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర పోషించినందుకు అన‌సూయ‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. దీంతో ఈ అమ్మ‌డిని అనేక క్రేజీ ప్రాజెక్టులు ప‌ల‌కరిస్తున్నాయి. ఎఫ్‌2 అనే చిత్రంలో అన‌సూయ గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుంద‌ని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై చిత్ర ద‌ర్శ‌కుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘‘f2’లో అనసూయ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక గీతంలోనూ కనిపించనున్నారు’ అని ఆయన ట్వీట్‌ చేశారు. దీనికి అనసూయ ప్రతిస్పందించారు. ‘నన్ను తీసుకున్నందుకు ధన్యవాదాలు డైరెక్టర్‌ సర్‌. మీరు నా ఆకాంక్షను తీర్చారు’ అని సమాధానం ఇచ్చారు. అన‌సూయ గ‌తంలో సాయిధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్ మూవీలో స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించిన సంగ‌తి తెల‌సిందే. మ‌ల్టీ స్టార‌ర్‌గా రూపొందుతున్న ఎఫ్ 2 సినిమాలో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్‌ కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు . ఈ సినిమా టీజర్‌ను డిసెంబరు 12న విడుదల చేయ‌నుండ‌గా, సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

2369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles