యాత్ర సినిమాలో ముఖ్య పాత్ర కోసం అన‌సూయ‌!

Sat,June 30, 2018 10:56 AM
Anasuya Bharadwaj special role in yatra

ఇన్నాళ్ళు బుల్లితెర‌పై త‌న యాంక‌రింగ్‌తో అద‌రగొట్టిన అన‌సూయ మ‌ధ్య మ‌ధ్య‌లో వెండితెర‌పై సంద‌డి చేస్తుంది. సెల‌క్టెడ్ పాత్ర‌లు ఎంచుకుంటూ బుల్లెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకుంది. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయ‌ని తెలుస్తుండ‌గా, వైఎస్ఆర్ బ‌యోపిక్ యాత్ర‌లో కీల‌క పాత్ర కోసం అన‌సూయ‌ని ఎంచుకున్నార‌నే టాక్ వినిపిస్తుంది. క‌ర్నూలు జిల్లాకు చెందిన పాపులర్ మహిళా లీడర్‌గా చిత్రంలో అన‌సూయ క‌నిపిస్తుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితంలోని ముఖ్య‌మైన ఏ అంశాన్ని వ‌ద‌లకుండా మ‌హీ ఈ సినిమా చేస్తున్నాడ‌ని తెలుస్తుండ‌గా, ఇంద‌లో పాద‌యాత్ర, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే స‌న్నివేశాలు అన్నింటిని చూపించ‌నున్నాడ‌ట‌. దివంగ‌త నేత‌ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్.

1465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS