జ‌బ‌ర్ధ‌స్త్‌కి అన‌సూయ గుడ్‌బై చెప్ప‌నుందా ?

Tue,June 18, 2019 10:26 AM
Anasuya Bharadwaj quits from jabardasth

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మానికి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అన‌సూయ అని చెప్ప‌వ‌చ్చు. అందంతో పాటు చలాకీ మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అన‌సూయ త్వ‌ర‌లో జ‌బ‌ర్ధ‌స్త్‌కి గుడ్ బై చెప్ప‌నుంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించిన అన‌సూయ వెండితెరపై న‌ట విశ్వ‌రూపం చూపించింది. దీంతో ఈ అమ్మ‌డికి వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌థ‌నం అనే చిత్రం చేస్తున్న అన‌సూయ ప‌లు చిత్రాల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఇటు జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మానికి అటు సినిమాల‌కి కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోతుంద‌ట‌. త‌న‌ కెరియ‌ర్‌కి మంచి బూస్ట‌ప్ ఇచ్చిన జ‌బ‌ర్ధ‌స్త్‌ని అన‌సూయ వీడడం మంచి ప‌ద్ద‌తి కాదంటూ నెటిజ‌న్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అన‌సూయ లేని జ‌బ‌ర్ధ‌స్త్‌కి క‌ళ త‌ప్ప‌డం ఖాయమ‌ని కూడా వారు వాపోతున్నారు.

4251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles