మెగా మ‌ల్టీస్టార‌ర్‌లో అన‌సూయ..!

Tue,April 24, 2018 09:29 AM
Anasuya Bharadwaj in multi starrer movie

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని తన మాట‌ల‌తో పాటు ఆట‌ల‌తో అల‌రించిన అన‌సూయ ప్ర‌స్తుతం వెండితెర‌పై కూడా బిజీగా మారుతుంది. సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర పోషించిన అన‌సూయ మెమోర‌బుల్ ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించింది. రామ్ చ‌ర‌ణ్‌,స‌మంత‌ల‌కి స‌మానంగా అన‌సూయ పాత్ర‌కి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో అన‌సూయ‌కి మ‌రిన్ని ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. వినోద‌భ‌రిత క‌థాంశంతో అనీల్ రావిపూడి ఓ మల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ తేజ్‌, వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి ఎఫ్2 అనే టైటిల్ పెట్టారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉపశీర్షిక‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రంలో అన‌సూయ కోసం స్పెష‌ల్ రోల్ క్రియేట్ చేశాడ‌ట అనీల్ రావిపూడి. ఈ మెగా మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ మే నుండి సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా, త్వ‌ర‌లోనే అన‌సూయ పాత్ర‌కి సంబంధించి క్లారిటీ రానుంది. ఇక క‌థానాయిక‌గా వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళుతున్న‌మెహ‌రీన్‌ని ఎంచుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, మ‌రో హీరోయిన్ విష‌యంలో క్లారిటీ రావ‌లసి ఉంది.

3768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles