కారు ఎత్తిన బాలయ్య‌.. స‌ర‌దా కామెంట్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా

Tue,January 16, 2018 01:13 PM
anand surprise comment on bala krishna

నంద‌మూరి బాల‌కృష్ణ‌- కేఎస్ ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం జై సింహా. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాల‌య్య అభిమానుల‌ని అల‌రించింది. త‌న‌దైన డైలాగ్స్‌తో పాటు కొన్ని స‌న్నివేశాలతో అభిమానుల‌ని ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేశాడు బాల‌య్య‌. అయితే ఈ చిత్రంలో బాల‌కృష్ణ బొలేరో కారుని సింగిల్ హ్యాండ్‌తో పైకెత్తే స‌న్నివేశం ఉండ‌గా, ఆ వీడియోని విష్ణు చైత‌న్య అనే ఒక నెటిజ‌న్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాకు ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. దానికి మహీంద్ర సర్‌..ఇలాంటిది మీ కలెక్షన్లలో ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో బొలెరో ట్రెండిగ్‌ అవుతోంది.. మీరు చూడండి అని కామెంట్ పెట్టాడు. దీనికి వెంట‌నే స్పందించిన ఆనంద్ మ‌హేంద్ర ‘హాహా..బొలెరో కార్లను చెక్‌ చేయడానికి సర్వీస్‌ వర్క్‌షాపులు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లు ఉపయోగించాల్పిన అవసరం లేదు’ అని సరదాగా ట్వీట్‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. బాల‌య్య 102వ చిత్రంగా తెర‌కెక్కిన జై సింహా మూవీలో క‌థానాయిక‌లుగా నయనతార, నటాషా దోషి, హరిప్రియలు నటించారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు.6644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS