సోనాలికి ఆనంద్ మహింద్రా ట్వీట్

Wed,July 11, 2018 05:23 PM
anand mahindra tweets about sonali bendre

ప్రముఖ భారతీయ సినీ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో అభిమానుల గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. సోనాలితో పని చేసిన సెలబ్రిటీలు అందరు ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేశారు. ఫ్యాన్స్ కొందరు ఆమె కోసం పూజలు చేశారు. అయితే తనకి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సపోర్ట్ చాలా ఉందని, వారి అండతో క్సాన్సర్ తో పోరాడతానని సోనాలి చెప్పుకొచ్చింది. క్యాన్సర్ కారణంగా తన పొడవాటి జుట్టుని కత్తిరించుకొని న్యూ లుక్ లోకి మారింది సోనాలి.న్యూ లుక్ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ఫేవరెట్ ఆథర్ ఇసబెల్ అలెండె చెప్పిన విషయాన్ని తన పోస్ట్లో ప్రస్తావించింది. ఏదైనా బలవంతంగా మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చే వరకు మనం ఎంత శక్తిమంతులమో మనకు తెలియదు. ఈ కష్టకాలంలో మనిషి ఏదైనా చేయగలడు. వీటిని తట్టుకొని మనుగడ సాధించగలిగే అద్భుతమైన సామర్థ్యం మనిషి సొంతం అని సొనాలి చెప్పింది.

అయితే సోనాలి పోస్ట్ కి స్పందించిన ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహింద్రా .. సోనాలి మీ నిజమైన అంతర్గత బలం, అనుకూలత కొత్త రూపంలో ప్రకాశిస్తుంది. రచయిత రిచార్డ్ రోల్ మాటలలో చెప్పాంటే మీరు పైకి ఎదిగేందుకే కింద పడుతున్నారు. ఇతరులకి స్పూర్తిదాయకంగా ఉన్నారు అని ట్వీట్ లో తెలిపారు. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించిన సోనాలి మరాఠీతో పాటు, దక్షిణభారతదేశంలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో టాప్ హీరోయిన్ గా నిలిచిన ఆమె చూడచక్కని అందం, అభినయంతో ఆకట్టుకుంది.సోనాలి మురారి, ఖడ్గం, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి తెలుగు చిత్రాలలోను నటించింది.


2174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles