ర‌వితేజ యంగ్‌లుక్‌పై క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

Sun,August 25, 2019 07:39 AM
anand gives clarity on raviteja look

మాస్ మహారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ప్రీ లుక్ విడుద‌ల చేయ‌గా, త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. కాని అంత‌లోనే ర‌వితేజ యంగ్ లుక్ అంటూ అచ్చం ర‌వితేజ లాగా ఉన్న ఓ వ్య‌క్తి ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది. దీనిపై ద‌ర్శ‌కుడు ఆనంద్ తన ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. రవితేజ కొత్త లుక్ అంటూ సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వం. డిస్కోరాజా చిత్ర బృందంఈ ఫోటోని ఎక్క‌డ ప్ర‌మోట్ చేయ‌లేదు. అతి త్వ‌ర‌లో ర‌వితేజ లుక్‌కి సంబంధించిన ఫోటోని విడుద‌ల చేస్తాం. అంత‌వ‌ర‌కు ఇలాంటి వార్త‌లు స‌ర్క్యులేట్ చేయవ‌ద్దు అని ఆనంద్ పేర్కొన్నారు .ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త.

2446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles