ఆక‌ట్టుకుంటున్న‌ విక్ర‌మ్ 58వ మూవీ పోస్టర్

Tue,May 21, 2019 08:33 AM
an official announcement on Chiyaan Vikram 58

విభిన్న క‌థా చిత్రాల‌లో వెరైటీ రోల్స్ పోషిస్తూ అభిమానుల‌చే శ‌భాష్ అనిపించుకుంటున్న న‌టుడు విక్ర‌మ్. ఆయ‌న న‌టించిన ‘కదరం కొండన్’ అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ పోలీస్ గా నటిస్తున్నాడు. అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 31న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా విక్ర‌మ్ త‌న 58వ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ‘డిమాంటి కాలనీ’, ‘ఇమైకా నొడిగల్‌’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని త‌న‌కి అందించిన అజయ్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో త‌న 58వ చిత్రం చేయ‌నున్నాడు విక్ర‌మ్. ఈ చిత్రం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. 7 స్క్రీన్‌ స్టూడియో బ్యానరుపై లలిత్‌కుమార్‌ భారీ బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించనున్నారు. వయాకమ్‌ 18 స్టూడియోస్‌ సహ నిర్మాత. త‌మిళం, హిందీ, తెలుగు భాష‌ల‌లో ఏక కాలంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, 2020లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగ‌స్ట్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్ ఆకట్టుకుంటుంది.

1683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles