నితిన్ చిత్రానికి ఆస‌క్తిక‌ర టైటిల్ ..!

Sat,March 30, 2019 01:04 PM
an interesting title for mithin, Krishna Chaitanya movie

శ్రీనివాస క‌ళ్యాణం చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ రోజు త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా త‌దుప‌రి ప్రాజెక్టుల‌కి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మా సినిమాలో నటించేందుకు రెడీ అయిన నితిన్ త్వ‌ర‌లో చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. వీటితో పాటు తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయ‌నున్నాడు. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్‌పై నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 సమ్మర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర టైటిల్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప‌వ‌ర్ పేట అనే టైటిల్ చిత్రానికి స‌రిగ్గా స‌రిపోతుందని, దీనినే ఫైన‌ల్ చేయాల‌ని టీం అనుకుంటుంద‌ట‌. ఈ చిత్రం నితిన్‌కి మంచి పేరు తీసుకు రానుంద‌ని చెబుతున్నారు. తెలుగుతో పాటు మ‌రో రెండు భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో వేరే భాష‌ల‌కి చెందిన న‌టీన‌టులు కూడా ఉంటారని టాక్ .

1275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles