శ్రీదేవిపై వీరాభిమానం.. అప్పుడు సింగపూర్, ఇప్పుడు చెన్నై

Thu,December 7, 2017 04:56 PM
an institute with sri devi name opens at chennai

కొందరు సినీతారలకు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు. వయస్సు పెరుగుతున్న కొద్ది వారిపై అభిమానం ఇంతకు పదింతలు పెరుగుతుంది. ఇందుకు ఉదాహరణ నిన్నటి తరం హీరోయిన్ శ్రీదేవి అని చెప్పవచ్చు. 50 ఏళ్లు దాటినా శ్రీదేవి చాలామందికి అతిలోక సుందరే . ఆమెని అభిమానించే అభిమానులు ఇప్పటికి చాలా మందే ఉన్నారు. కేవలం మనదేశంలోనే కాదు విదేశాలలోను శ్రీదేవిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమానం చాటుకుంటున్నారు.

ఇటీవల సింగపూర్ లోని ఓ రెస్టారెంట్ యజమాని శ్రీదేవిపై ఉన్న అమితమైన ప్రేమతో అందమైన బొమ్మను తయారు చేయించి రెస్టారెంట్ లో పెట్టుకున్నాడు. సంవత్సరం పొడుగునా ఈ బొమ్మ కస్టమర్స్ ని అలరిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా చెన్నైలో అనీశ్ నాయర్ అనే వ్యక్తి శ్రీదేవిపై ఉన్న అభిమానంతో ఆమె పేరిట 2018లో ఓ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ఇందులో నటన, నాట్యంకి సంబంధించి శిక్షణ ఇస్తారట. పేదపిల్లలకి అయితే ఉచితంగా శిక్షణ ఇస్తామని అనీశ్ అంటున్నాడు.

తన పేరుతో ఓ ఇనిస్టిట్యూట్ ప్రారంభిస్తున్నారనే విషయం తెలుసుకున్న శ్రీదేవి చాలా హ్యపీగా ఫీలైనట్టు తెలుస్తుంది. ఇక ఇనిస్టిట్యూట్ ప్రారంభానికి శ్రీదేవి ముఖ్య అతిధిగా వస్తారని టాక్స్ వినిపిస్తున్నాయి. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాతో పాటు పలు దేశాల్లోనూ ఈ ఇనిస్టిట్యూట్ కి సంబంధించిన బ్రాంచ్ లు ప్రారంభించాలని అని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

1787
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS