మ‌హారాష్ట్ర సీఎం వైఫ్, ర‌జ‌నీకాంత్ మీటింగ్ కు కార‌ణం ?

Thu,June 8, 2017 05:32 PM

ఒకప్పుడు బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న అమృత మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ ని వివాహం చేసుకొని సీఎం వైఫ్ గా ప్రమోషన్ ని పొందింది. ఇప్పటికి ఆ ఉద్యోగం కంటిన్యూ చేస్తూనే అడపాదడపా మరాఠీ- బాలీవుడ్‌ సినిమాలకు పాటలు పాడుతూ ఉంటుంది. ఈ మధ్య ఫిర్ సే, జై గంగాజల్‌ అనే చిత్రాలలో పాటలు పాడింది అమృత. ఫిర్ సే అంటూ సాగే ఓ మ్యూజిక్ వీడియో కోసం అమృత బిగ్‌ బీతో కలిసి స్టెప్పులేసింది. ఈ నేప‌థ్యంలో అమృత సినిమాల‌లోకి ఎంట్రీ ఇస్తుందా అని వార్త‌లు అప్ప‌ట్లో షికారు చేశాయి. తాజాగా ర‌జనీకాంత్ తాజా చిత్రం కాలా సినిమాలో అమృత ఓ పాట పాడ‌నుందంటూ కొంద‌రు జోరుగా ప్ర‌చారం చేశారు. ఈ రూమ‌ర్స్ అమృత చెవిన ప‌డ‌డంతో తాజాగా త‌న ట్విట్ట‌ర్ లో ర‌జినీకాంత్ తో క‌లిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ పుకార్ల‌ని ఖండించింది. సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో గొప్ప మీటింగ్ జ‌రిగింది. సామాజిక ఆందోళ‌న‌లు, వాటి ప‌రిష్కారాల గురించి చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని అమృత పేర్కొంది. దీంతో అమృత సినిమా ఎంట్రీపై వ‌స్తున్న‌ రూమ‌ర్స్ కి బ్రేక్ ప‌డ్డ‌ట్టు అయింది.




1981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles