నాగ శౌర్య ఫ్యామిలీ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

Tue,February 13, 2018 03:28 PM
ammamma garillu first look revealed

యంగ్ హీరో నాగశౌర్య రీసెంట్ గా ఛలో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇక ప్రస్తుతం సుందర్ సూర్య దర్శకత్వంలో అమ్మమ్మ గారిల్లు అనే చిత్రం చేస్తున్నాడు. షామిలీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. చక్కటి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఇది అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఓయ్ సినిమా తర్వాత షామిలీ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రిలేష‌న్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథ రాసుకున్నట్టు దర్శకుడు తెలియజేశాడు. తెర‌పై సినిమా చూస్తున్నంత సేపు ఆడియ‌న్స్ కు థియేట‌ర్ లో ఉన్నామ‌న్నా ఫీలింగ్ రాకుండా పండ‌గ వాతావ‌ర‌ణంలో త‌మ కుటుంబంతో గ‌డుపుతున్న అనుభూతి క‌లిగేలా సినిమా తీసామని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. వీలైనంత త్వరలోనే మూవీ విడుదలకి ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

2793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles