అమితాబ్ ప్రయాణ ఖర్చులు కూడా తీసుకోలేదు: చరణ్

Wed,August 21, 2019 04:36 PM
amithab bachan dont take even travelling charges says ramcharan

ముంబై: రామ్‌చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైరా సినిమాలో అమితాబ్ బచ్చన్ చిరంజీవికి గురువుగా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తుండగా, అతని గురువుగా బిగ్‌బీ అమితాబ్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌చరణ్ ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాన్న గారు ఫోన్‌చేసి మా సినిమాలో మీరు నటించాలని అమితాబ్ గారిని కోరగా, అతను వెంటనే ఓకే చేయడం మా అదృష్టమని, ఆయన హిందీయేతర సినిమాలో నటించడం ఇదే మొదటిసారి అయ్యుంటదని చరణ్ అన్నారు. కాగా, అమితాబ్‌గారు కనీసం ప్రయాణ ఖర్చులు కూడా మా దగ్గర తీసుకోలేదని, కథ నచ్చి, చిరుతో స్నేహం కోసం ఈ సినిమా చేస్తున్నానని ఆయన అన్నారన్నారు.
కాగా, నిన్న విడుదలైన సైరా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నది. పవన్‌కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

3172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles