ర‌జ‌నీకాంత్‌కి ప్రత్యేక శుభాకాంక్ష‌లు తెలిపిన‌ మెగాస్టార్

Wed,December 12, 2018 08:46 AM
Amitabh Bachchan wishes to rajanikanth

త‌న స్టైల్‌తో పాటు డైలాగ్స్‌తో ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగించే హీరో ర‌జ‌నీకాంత్‌. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న ర‌జ‌నీకి మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం 2.0 చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాగా, ఈ సినిమాకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సంక్రాంతికి పేటా అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. నేడు ర‌జ‌నీకాంత్ బ‌ర్త్‌డే. డిసెంబ‌ర్ 12, 1950లో జ‌న్మించిన ర‌జ‌నీకాంత్ నేటితో 68వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానులు ర‌క్త దానాలు, అన్న‌దానాల‌తో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇక సినీ సెల‌బ్రిటీలు త‌లైవ‌ర్‌కి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్‌తో దిగిన ఫోటోల‌న్నింటిని షేర్ చేస్తూ..జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌రి కొద్ది నిమిషాల‌లో పేటా సినిమాకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ఇది అభిమానుల‌కి మంచి ఫీస్ట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.




1632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles