అమితాబ్‌ది ఎంత పెద్ద మ‌న‌సో చూడండి

Tue,November 20, 2018 10:27 AM
Amitabh Bachchan to Pay off Loans of UP Farmers

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరోగా చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. నిజ జీవితంలో ఎంతో మందికి సాయం అందించిన బిగ్ బీ గ‌తంలో మ‌హారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల లోన్స్‌ని మాఫీ చేయించాడు. ఈ సారి ఉత్తర ప్ర‌దేశ్‌లోని రైతు కుటుంబాల‌కి అండ‌గా నిలిచాడు. 1398మంది రైతుల రుణాలని మాఫీ చేయించాడు. 70 మంది రైతుల కోసం ఓ కంపార్ట్‌మెంట్‌ని బుక్ చేసి వారిని ఉత్త‌ర ప్ర‌దేశ్ నుండి ముంబైకి రావ‌ల‌సిందిగా కోరాడు. ముంబైలో బిగ్ బీ ఆఫీసులో ఈ నెల 26న వారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సింగిల్ సెటిల్‌మెంట్ పేప‌ర్స్ అందిస్తార‌ట‌. లోన్స్ మాఫీ కోసం అమితాబ్ 4.05 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు తెలుస్తుంది. బ‌ల‌వంతంగా వ్య‌భిచార గృహాల్లోకి నెట్టి వారి జీవితాన్ని చిన్నా భిన్నం చేసే వారి నుండి యువ‌తుల‌ని ర‌క్షించి వారి కోసం పాటు ప‌డుతున్న అజీత్ సింగ్‌కి కూడా అమితాబ్ కొంత మొత్తం ఇవ్వ‌నున్నారు. అమితాబ్ సేవ‌లకి గాను ఆయ‌న స‌యాజీ ర‌త్న అనే అవార్డ్ అందుకున్నారు.

2657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles