రైతుల రుణాలు తీర్చేందుకు ముందుకొచ్చిన మెగాస్టార్

Sat,October 20, 2018 12:15 PM
Amitabh Bachchan To Pay Off Loans Of Over 850 Farmers

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరోగా చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. నిజ జీవితంలో ఎంతో మందికి సాయం అందించిన బిగ్ బీ తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌కి చెందిన 850కి పైగా రైతుల రుణాల‌ని తీరుస్తాన‌ని అన్నాడు. గ‌తంలో మ‌హారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల లోన్స్‌ని బిగ్ బీ మాఫీ చేసిన సంగ‌తి తెలిసిందే. రైతుల గురించి మాట్లాడిన అమితాబ్ మ‌న కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న రైతుల‌ని ఆదుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. గ‌తంలో ఆంధ్ర‌, విద‌ర్భ ప్రాంతాల‌కి చెందిన రైతుల రుణాలు మాఫీ చేశాను. ఇప్పుడు ఉత్త‌ర ప్రదేశ్ రైతుల రుణాలు మాఫీ చేయ‌బోతున్నాను.

గ‌తంలో 350కి పైగా రైతు కుటుంబాలు లోన్ తీర్చ‌లేని స్థితిలో ఉండ‌గా, కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాల‌నుకున్నారు. అలాంటిది జ‌ర‌గ‌కుండా కొన్ని రోజుల క్రితం లోన్ మాఫీ చేసాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో 850కి పైగా రైతులు లోన్ క‌ట్ట‌లేని పరిస్థితిలో ఉన్నారు. వారికి 5.5 కోట్ల రూపాయ‌ల‌ని వారికి చెల్లించి వారి జీవితాల‌ని పున‌ర్నిర్మాణం చేయాల‌ని భావిస్తున్నాను అంటూ అమితాబ్ బ్లాగ్‌లో తెలిపారు. మ‌న‌కోసం ఎన్నో త్యాగాలు చేసే వారి కోసం నేను చేసే ఈ చిన్న సాయం ఎంతో సంతృప్తినిస్తుంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు బ‌ల‌వంతంగా వ్య‌భిచార గృహాల్లోకి నెట్టి వారి జీవితాన్ని చిన్నా భిన్నం చేసే వారి నుండి యువ‌తుల‌ని ర‌క్షించి వారి కోసం పాటు ప‌డుతున్న అజీత్ సింగ్‌కి కూడా కొంత మొత్తం ఇవ్వ‌నున్న‌ట్టు అమితాబ్ తెలిపారు.

3485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS