అనుష్కని ఆట‌ప‌ట్టించిన అమితాబ్

Fri,September 21, 2018 02:01 PM
Amitabh Bachchan teases Anushka Sharma

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చ‌న్ ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్కోసారి ఆయ‌న వేసే ఛ‌లోక్తులు క‌డుపుబ్బ న‌వ్వుకునేలా చేస్తాయి. తాజాగా త‌నుహోస్ట్ చేస్తున్న కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అనుష్క‌పై సెటైర్ వేసి ఆమె క‌డుపుబ్బ న‌వ్వేలా చేశారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన స‌ర‌దా సంభాష‌ణ‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. వివ‌రాలలోకి వెళితే అనుష్క న‌టించిన తాజా చిత్రం సూయి దాగా. వ‌రుణ్ ధావ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం శ‌ర‌త్ క‌ఠారియా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. సెప్టెంబ‌ర్ 28న చిత్ర విడుద‌లకి ప్లాన్ చేశారు. ఈ క్ర‌మంలో త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కోసం కౌన్ క‌నేగా క‌రోడ్ ప‌తి ప్ర‌మోష‌న్ కి వెళ్ళారు వ‌రుణ్ ధావ‌న్, అనుష్క జంట‌.

అమితాబ్ ముందున్న హాట్ సీట్లో కంటెస్టెంట్‌తో కూర్చుంది అనుష్క. కంటెస్టెంట్ తో మాట్లాడుతూ.. మీరు క్రికెట్ చూస్తారా అని అడిగాడు అమితాబ్‌. అందుకు ఆ యువ‌తి చూసే స‌మ‌యం లేద‌ని చెబుతుంది. ఇంత‌లో అమితాబ్ .. అనుష్క క్రికెట్ చూస్తుంద‌ని మా అంద‌రికి తెలుసు అంటారు. అప్పుడు అనుష్క ఆ యువతికి నా భ‌ర్త క్రికెట‌ర్, అందుకే క్రికెట్ చూస్తుంటాన‌ని అంటుంది. దీనికి అమితాబ్ కేవ‌లం అత‌నిని చూసేందుకే మ్యాచ్ చూస్తావా అని అనుష్క‌ని అడ‌గ‌గా, అలాంటిదేమి లేదు. భారత్ టీం ని స‌పోర్ట్ చేసేందుకు కూడా అంటుంది. ఈ క్రమంలో అమితాబ్ అనుష్కని టీజ్ చేస్తూ టీవీలో ఏం జ‌రుగుతుందో అంద‌రికి తెలిసిందే. గ్రౌండ్‌లో ఉన్న విరాట్‌కి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత ఎంట‌ర్‌టైన్ చేస్తావో చూస్తూనే ఉన్నాం అని అన‌డంతో అనుష్క ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతుంది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి సంభాష‌ణ వీడియో వైర‌ల్ అయింది.


3398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles