అమితాబ్ తమిళ చిత్రం ఫొటోలు వైరల్

Mon,April 1, 2019 07:21 PM
Amitabh Bachchan Tamil Film looks Goes viral

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఉయర్నత మనిథన్. తమిజావానన్ దర్శకుడు. ఈ చిత్రంలో నటుడు, డైరెక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమితాబ్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఎస్‌జే సూర్య ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.


అమితాబ్ తెల్ల రంగు ధోతి, గోధుమరంగు కుర్తా, గుండ్రని కళ్లద్దాలు, నుదుటిపై మూడు నామాలు, భుజంపై ఎర్ర రుమాలుతో సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. బిగ్ బీతో నటించే అవకాశం రావడంపై ఆనందంలో మునిగితేలుతున్నాడు ఎస్‌జే సూర్య. నా జీవితంలోనే సంతోషకరమైన సందర్భం. ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్‌తో సినిమా చేయాలన్న కల నెరవేర్చిన దేవుడికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఈ విషయాన్ని రజనీకాంత్ సర్, ఏఆర్ మురుగదాస్‌లతో షేర్ చేసుకుంటున్నా అని ట్వీట్ చేశాడు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయనున్నారు.
1475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles