త‌న‌ని ప‌ట్టించుకోలేద‌ని బిగ్‌బీ చెంప‌పై కొట్టిన కొండ‌ముచ్చు

Wed,June 13, 2018 12:25 PM
Amitabh Bachchan shares throw back picture

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న జీవితంలో జ‌రిగిన ఫ‌న్నీ ఇన్సిడెంట్స్‌తో పాటు షూటింగ్ టైంలో జ‌రిగిన కొన్ని ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల‌ని బిగ్ బీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తుంటారు. తాజాగా 1978లో వచ్చిన ‘గంగా కీ సౌగంధ్‌’ చిత్రీకరణ స‌మ‌యంలో జ‌రిగిన ఫ‌న్నీ ఇన్సిడెంట్ గురించి వివ‌రించారు . హృషికేశ్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు ఓ కొండ‌ముచ్చు అమితాబ్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చింద‌ట‌. అప్పుడు దానికి ఆహారం పెడుతూ వేరే కొండముచ్చుని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అది బిగ్ బీ చెంప‌పై కొట్టి పారిపోయింద‌ట‌. ఈ విష‌యాన్ని వివ‌రిస్తూ లొకేష‌న్‌కి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు మెగాస్టార్. ‘గంగా కీ సౌగంధ్‌’ చిత్రం సుల్తాన్ అహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఈ చిత్రం అప్ప‌ట్లో భారీ హిట్ సాధించింది. చిత్రంలో అమితాబ్‌కి జోడిగా రేఖ న‌టించారు. ఇటీవ‌ల 102 నాటౌట్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అమితాబ్ ప్ర‌స్తుతం ‘బ్రహ్మాస్త్రా’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు.


3627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS