హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులపై అమితాబ్‌ బచ్చన్‌ ప్రశంసలు

Sat,July 6, 2019 03:23 PM

ముంబయి: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రశంసలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు నగరంలో నూతన సిగ్నల్‌ విధానాన్ని అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. నగరంలోని పలు కూడళ్లలో జీబ్రా క్రాసింగ్స్‌ వద్ద రంగులు మారే ఎల్‌ఈడీ లైట్లను అమర్చిన విషయం తెలిసిందే. ఈ అమరిక వల్ల జీబ్రా క్రాసింగ్‌కు కొద్దిగా ముందుగానే వాహనదారులు తమ వాహనాలను నిలిపివేయాల్సి వస్తుంది. దీంతో పాదచారులు సులువుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెడ్‌ సిగ్నల్‌ పడ్డప్పుడు రోడ్డును దాటుతున్నారు. ఈ లైట్ల అమరికతో మరో వైపు వాహనదారుల్లో రహదారి క్రమశిక్షణ సైతం అలవడుతుంది. ఈ నూతన విధానం గురించి తెలిసిన అమితాబ్‌ బచ్చన్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల పనితీరును ప్రశంసించారు. అత్యంత ప్రభావవంతంగా పనిచేసే సూపర్‌ ఆలోచన ఇది అని కొనియాడారు.4583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles