ఇంగ్లీష్ వర్సెస్ హిందీ.. అమితాబ్ ట్వీట్‌పై నెటిజన్ల నవ్వులు

Thu,January 10, 2019 03:18 PM
Amitabh Bachchan hilarious tweet on efficiency of English and Hindi languages

ఇంగ్లీష్ వర్సెస్ హిందీ.. ఈ రెండు భాషల్లో ఏది గొప్ప అనే దాని మీద కాదు ఇక్కడ చర్చ. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఏది సమర్థమైన భాష అనే దానికి ఓ చిన్న ఉదాహరణతో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ చెప్పేశారు. ఆ ఉదాహరణ నెటిజన్లకు నచ్చింది. దీంతో నెటిజన్లు బిగ్‌బీ ఉదాహరణను చూసి పడిపడినవ్వుకుంటున్నారు.ఆయన ఇవాళ ఉదయం ఓ ట్వీట్ వదిలారు. ఏమని అంటే... హిందీ భాష సామర్థ్యం చూడండి అంటూ.. ఇంగ్లీష్‌లో అయితే.. ఐయామ్ సారీ.. ఐ కెనాట్ హియర్ యు ప్రాపర్లీ, కెన్ యూ ప్లీజ్ రిపీట్ వాట్ ఈజ్ ద మ్యాటర్.. అని అంటారట. అదే హిందీలో అయితే.. హేన్.. అంటారట. హిందీలో ఒకటే పదం.. హేన్ అంటే ఇంగ్లీష్‌లో హా అని ఆర్థం. తెలుగులో కూడా మనం హా.. అనే అంటాం. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఎదుటివాళ్లు మాట్లాడేది అర్థం కానప్పుడు తెలుగులో కూడా హా... అని అంటాం. అంటే.. అవతలి వ్యక్తి చెప్పింది అర్థం కాలేదని.. మళ్లీ చెప్పాలని అర్థం. ఇంగ్లీష్‌లో అయితే.. మూడు నాలుగు సెంటెన్సులు చెప్పాలి.. అదే హిందీలో ఒకే ఒక పదంతో పని అయిపోతుంది. అదే హిందీ గొప్పతనం అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను మెచ్చిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటూ ఆ ట్వీట్‌కు తగిన కామెంట్లు పెడుతున్నారు.2182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles